
దుబాయ్ : టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (796 రేటింగ్ పాయింట్లు).. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌లోకి దూసుకొచ్చాడు. బుధవారం విడుదలైన తాజా జాబితాలో గిల్ పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (773) ను రెండో ర్యాంక్‌కు నెట్టి టాప్‌లోకి వచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (761), విరాట్ కోహ్లీ (727) వరుసగా మూడు, ఆరో ర్యాంక్‌ల్లోనే కొనసాగుతున్నారు. బౌలింగ్‌లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక ప్లేస్ మెరుగై నాలుగో ర్యాంక్‌లోకి వచ్చాడు.