ట్రోఫీ ముంగిట తడాఖా.. గిల్ సెంచరీ.. శ్రేయస్, కోహ్లీ ఫిఫ్టీలు

ట్రోఫీ ముంగిట తడాఖా.. గిల్ సెంచరీ.. శ్రేయస్, కోహ్లీ ఫిఫ్టీలు
  • మూడో వన్డేలో 142 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌పై  ఇండియా విక్టరీ
  • 3–0తో సిరీస్‌‌‌‌ క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌

అహ్మదాబాద్‌‌‌‌: స్వదేశంలో తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల జోరు కొనసాగిస్తూ బుధవారం జరిగిన మూడో వన్డేలో 142 రన్స్‌‌‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌‌‌పై గ్రాండ్ విక్టరీ సాధించింది. ఫలితంగా సిరీస్‌‌‌‌ను 3–0తో క్లీన్‌‌‌‌స్వీప్ చేసింది. ఏకపక్ష పోరులో  మొదట బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 356 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది.  ఇంగ్లిష్ టీమ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్‌‌‌‌లో ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 స్కోరుకే ఆలౌటైంది. టామ్ బాంటమ్ (38), గస్ అట్కిన్సన్ (38), బెన్ డకెట్ (34) కాసేపు ప్రతిఘటించారు. ఆతిథ్య బౌలర్లలో అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌, హర్షిత్‌‌‌‌ రాణా, అక్షర్ పటేల్‌‌‌‌, పాండ్యా తలో రెండు వికెట్లు పడగొట్టారు. శుభ్‌‌‌‌మన్ గిల్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌, సిరీస్‌‌‌‌ అవార్డులు లభించాయి. 

గిల్‌‌‌‌ జోరు.. రాణించిన కోహ్లీ,  అయ్యర్‌‌‌‌ 

టాస్ కోల్పోయి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఇండియాకు ఆరంభంలోనే  ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌‌‌‌లో సూపర్ సెంచరీతో ఫామ్‌‌‌‌లోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (1)ఈసారి ఫెయిలయ్యాడు. పేసర్‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌ వుడ్‌‌‌‌ తన తొలి బాల్‌‌‌‌కే రోహిత్‌‌‌‌ బ్యాట్‌‌‌‌ నుంచి ఎడ్జ్ రాబట్టి కీపర్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌తో ఔట్ చేశాడు. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన విరాట్ కోహ్లీ తోడుగా వైస్ కెప్టెన్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను నిర్మించాడు. అద్భుతమైన ఫుట్‌‌‌‌వర్క్‌‌‌‌తో ఇంగ్లండ్‌‌‌‌ పేసర్లతో పాటు స్పిన్నర్లను ఎదుర్కొన్న అతను నాణ్యమైన షాట్లతో బౌండ్రీలు రాబట్టాడు. మరో ఎండ్‌‌‌‌లో  వరుస ఫెయిల్యూర్స్ తర్వాత కోహ్లీ కూడా గాడిలో పడ్డాడు. మార్క్‌‌‌‌ వుడ్ బౌలింగ్‌‌‌‌లో కవర్ డ్రైవ్‌‌‌‌తో తొలి ఫోర్ రాబట్టిన కోహ్లీ.. మహ్మూద్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో రెండు ఫోర్లతో జోరందుకున్నాడు. 38 రన్స్‌‌‌‌ వద్ద ఎల్బీ అప్పీల్‌‌‌‌ నుంచి బయటపడిన విరాట్ 50 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అంతకుముందే గిల్ కూడా ఫిఫ్టీ అందుకోగా.. ఇండియా స్కోరు 100 దాటింది.  రషీద్ బౌలింగ్‌‌‌‌లో తడబడిన కోహ్లీ చివరికి అతనికే వికెట్‌‌‌‌ ఇచ్చుకోవడంతో రెండో వికెట్‌‌‌‌కు 116 పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది.

 ఈ దశలో క్రీజులోకి  వచ్చిన శ్రేయస్ అయ్యర్ తన ఫామ్‌‌‌‌ను కొనసాగించాడు. వరుస షాట్లతో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు.  అప్పటికే క్రీజులో కుదురుకున్న గిల్‌‌‌‌ సైతం మరింత జోరు పెంచాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌‌‌‌లో ఫోర్‌‌‌‌‌‌‌‌తో 95 బాల్స్‌‌‌‌లోనే సెంచరీ అందుకున్నాడు. రషీద్ బౌలింగ్‌‌‌‌లో లాంగాన్‌‌‌‌ మీదుగా భారీ  సిక్స్‌‌‌‌ కొట్టిన గిల్‌‌‌‌ అతని బౌలింగ్‌‌‌‌లోనే స్వీప్‌‌‌‌ షాట్‌‌‌‌కు ట్రై చేసి బౌల్డ్ అవ్వడంతో మూడో వికెట్‌‌‌‌కు 104 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. గిల్ వెనుదిరిగినా వెనక్కుతగ్గని శ్రేయస్‌‌‌‌ 43 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అతను కూడా సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ, రషీద్ లెగ్‌‌‌‌ స్టంప్‌‌‌‌పై వేసిన బాల్‌‌‌‌కు అనవసర షాట్‌‌‌‌ ఆడి కీపర్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా (17), అక్షర్ పటేల్ (13) ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయినా..  ఐదో నంబర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన కేఎల్ రాహుల్ (40) స్లాగ్ ఓవర్లలో ఆకట్టుకున్నాడు. చివర్లో సుందర్‌‌‌‌‌‌‌‌ (14), హర్షిత్ రాణా (13) స్కోరు 350
మార్కు దాటించారు. 

ఇంగ్లండ్ ఢమాల్‌‌‌‌..

భారీ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌ను ఇంగ్లండ్ మెరుపు వేగంతో ఆరంభించినా.. ఆ తర్వాత ఇండియా బౌలర్ల  దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయింది.  స్టార్టింగ్‌‌‌‌లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (23), బెన్ డకెట్‌‌‌‌ దూకుడుగా ఆడుతూ వరుస బౌండ్రీలతో హోరెత్తించారు. దాంతో ఆరు ఓవర్లకే స్కోరు 60 దాటింది. కానీ, తన వరుస ఓవర్లలో ఈ ఇద్దరినీ పెవిలియన్ చేర్చిన పేసర్ అర్ష్​దీప్ సింగ్‌‌‌‌ ప్రత్యర్థికి డబుల్ షాక్ ఇచ్చాడు. వన్‌‌‌‌డౌన్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ బాంటన్, జో రూట్ (24) కూడా వేగంగా ఆడటంతో ఓ దశలో 125/2తో నిలిచిన ఇంగ్లండ్ గట్టి పోటీ ఇచ్చేలా కనిపించింది. ఇక్కడి నుంచి ఆతిథ్య బౌలర్ల హవా మొదలైంది. 18వ ఓవర్లో కీపర్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌తో బాంటమ్‌‌‌‌ను పెవిలియన్ చేర్చిన కుల్దీప్ కీలక బ్రేక్ ఇచ్చాడు. ఆ వెంటనే అక్షర్ పటేల్ ఫుల్ లెంగ్త్ బాల్‌‌‌‌తో రూట్‌‌‌‌ను క్లీన్‌‌‌‌ బౌల్డ్ చేసి ఇండియా టీమ్‌‌‌‌లో జోష్ నింపాడు. కాసేపటికే  కెప్టెన్ బట్లర్ (6)తో పాటు హ్యారీ బ్రూక్‌‌‌‌ (19)ను హర్షిత్ రాణా  తన వరుస ఓవర్లలో బౌల్డ్ చేయడంతో ఇంగ్లిష్ టీమ్ 161/6తో ఓటమికి సిద్ధమైంది. అట్కిన్సన్‌‌‌‌ కాసేపు పోరాడినా ..  హిట్టర్ లివింగ్‌‌‌‌ స్టోన్ (9), ఆదిల్ రషీద్ (0), మార్క్ వుడ్ (9) బ్యాట్లెత్తేయడంతో ఇంగ్లండ్‌కు భారీ ఓటమి తప్పలేదు.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా:  50 ఓవర్లలో 356 ఆలౌట్ (గిల్ 112, శ్రేయస్ 78,
కోహ్లీ 52, ఆదిల్ రషీద్ 4/64).
ఇంగ్లండ్: 34.2 ఓవర్లలో 214 ఆలౌట్‌‌‌‌ (అట్కిన్సన్ 38, 
బాంటన్ 38, అక్షర్ 2/22, అర్ష్‌‌‌‌దీప్ 2/33).

  • కెరీర్‌‌లో 50వ వన్డేలో సెంచరీ చేసిన తొలి ఇండియన్ శుభ్‌‌‌‌మన్ గిల్. వేగంగా 2500 రన్స్‌ క్లబ్‌లోనూ చేరాడు. 
  • వన్డేల్లో గిల్‌‌‌‌కు ఇది ఏడో సెంచరీ. తక్కువ ఇన్నింగ్స్‌‌‌‌ల్లో (50) ఏడు సెంచరీలు చేసిన ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు.
  • నరేంద్ర మోదీ స్టేడియంలో గిల్‌‌‌‌ వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో సెంచరీలు కొట్టాడు. ఇలా ఒకే వేదికపై  మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఐదో ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు.  ఐపీఎల్‌‌‌‌లోనూ ఈ వేదికపై గిల్ వంద సాధించాడు. 
  • ఇంటర్నేషనల్ క్రికెట్‌‌‌‌లో కోహ్లీని అత్యధికంగా 11సార్లు ఔట్ చేసిన మూడో బౌలర్‌‌‌‌‌‌‌‌గా  ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్  నిలిచాడు.  న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ, ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్‌‌‌‌వుడ్  (చెరో 11సార్లు) రికార్డు సమం చేశాడు.
  • ఈ మ్యాచ్‌‌‌‌లో ఇరు జట్ల క్రికెటర్లు చేతులకు గ్రీన్‌‌‌‌ రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. అవయవ దానంపై అవగాహన కల్పించేం దుకు బీసీసీఐ చేపట్టిన ‘డొనేట్ ఆర్గాన్స్‌‌‌‌, సేవ్​ లైవ్స్’ ప్రచారంలో క్రికెటర్లు భాగం అయ్యారు.