నాలుగు స్థానాల్లో బలాబలాల్ని డిసైడ్ చేసేది చెరకు రైతులే

మహారాష్ట్రలోని నాలుగు  లోక్ సభ నియోజకవర్గాల్లో బలాబలాల్ని చక్కెర రైతులు ప్రభావితం చేయగలరు.కొన్నేళ్లుగా షుగర్ సెక్టార్ కు సంబంధించిన వ్యక్తులనే ఎంపీలుగా ఎన్నుకుంటున్నా వాళ్ల సమస్యలు తీరడంలేదు. పార్టీ ఏదైనా ప్రాతినిధ్యం వహించేది చక్కెర పరిశ్రమకు చెందినవారే. అయినా అక్కడి రైతులకు మిల్లుల నుంచి రావలసిన బకాయిలను ఇప్పించ లేకపోతున్నారు. పంటకు కనీస మద్దతు ధర తేలేకపోతున్నారు.ప్రస్తుత ఎలక్షన్ లో కనీసం ఆ అంశాలను ప్రస్తావించటానికే ఏ పార్టీవాళ్లూ ఇష్టపడలేదు.

మహారాష్ట్ర పాలిటిక్స్‌‌లో షుగర్‌‌ లాబీ పాత్రఎక్కువ. నాలుగు లోక్‌ సభ స్థానాలను చెరకు రైతులు ప్రభావితం చేయగల సంఖ్యలో ఉంటారు. చెరకు సాగు చేసేవారి సంఖ్య ఎక్కువఉన్న ఆ సెగ్మెంట్లు.. సాంగ్లీ, హట్కనంగలే, కొల్హాపూర్ , సతారా. ఈ నాలుగు ని యోజకవర్గాలకు ‘షుగర్ కేన్ బెల్ట్’ గా పేరు. వీటికి 23న ఎన్నికలుజరగబోతున్నా యి. దక్షిణ మహారాష్ట్ర పరిధిలోకి వచ్చే ఈ సీట్లకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా చక్కెర రైతుల సమస్యలే ప్రధానంగా ప్రస్తావనకు వస్తాయి.కానీ ఈసారి వాటిని ఏ పార్టీ అభ్యర్థీ పట్టించుకోలేదు. ప్రచారంలో గానీ ప్రసంగాల్లో గానీ అసలు ఆ అంశాల జోలికే వెళ్లలేదు. చెరకు పండిం చేవాళ్లకుప్రభుత్వం , ఫ్యాక్టరీలు, మిల్లుల నుంచి కోట్ల రూపాయల్లో బకాయిలు పేరుకుపోయాయి. వాటిని ఇప్పిస్తామని ఒక్క క్యాండిడేటూ హామీ ఇవ్వలేదు. చెరకురైతుల తరఫున పోరాడి పాలిటిక్స్​లోకి వచ్చి న‘స్వాభిమాని పక్ష’ పార్టీ చీఫ్​ రాజు షెట్టి సైతం ఈ ఇష్యూని దాటవేశారు. ఈ సీట్లలో ఇప్పటివరకు గె లిచినవాళ్లలో ఎక్కువమంది చక్కెర అమ్మి కోట్లకు పడగలెత్తి నవారే. కోపరేటివ్ సొసైటీల్లో నూ వాళ్ల మనుషులనే పెడుతున్నారు . ఈ ఏరియాల్లో కొన్నేళ్లుగా ప్రైవేట్ మిల్లులసంఖ్య పెరుగుతోంది. బడా వ్యా పారులతో చెరకుపంటకు మంచి ధర ఇప్పించడానికి ‘స్వాభిమాని పక్ష (ఎస్‌‌డబ్ల్ యూపీ)’ గతంలో కృషి చేసింది. ఈమేరకు రైతుల పక్షాన నిలిచి ఎన్నోసార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. తద్వారా వాళ్ల మద్దతుతో2014 లోక్​సభ ఎన్నికల్లో హట్కనంగలే నుంచి రాజు షెట్టి (ఎస్‌‌డబ్ల్ యూపీ) ఎంపీగా గెలిచారు.

అప్పుడూ ఇప్పుడూ వాళ్లే..

పోయిన జనరల్‌ ఎలక్షన్‌‌లో కొల్హా పూర్ , సతారాసెగ్మెంట్లలో ఎన్ సీపీ అభ్యర్థులు ధనంజయ్మహాధిక్, ఉదయన్ రాజే విజయం సాధిం చారు.సాంగ్లీ నుంచి బీజేపీ క్యాండిడేట్ సంజయ్ పాటిల్ ఎన్నికయ్యారు . ఇందులో ముగ్గురికీ (రాజు షెట్టి,మహాధిక్​, సంజయ్ లకు) షుగర్ సెక్టార్ తో బలమైనసంబంధాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లోనూ దాదాపు అన్ని పార్టీలూ చక్కెర పరిశ్రమతో అనుబంధం ఉన్న అభ్యర్థులనే బరిలో నిలిపాయి. కొల్హా పూర్లో ఎన్ సీపీ తరఫునే మళ్లీ పోటీకి దిగిన మహాధిక్…‘సదాశివ్ రావ్ మాండ్లిక్​ కోపరేటివ్ షుగర్ మిల్లు’కిఛైర్మన్ .ఈయన శి వసేన క్యాండిడేట్ సంజయ్ మాండ్లిక్​తో పోటీ పడుతున్నారు . సాంగ్లీలో స్వాభిమాని పక్ష పార్టీ బీఫాంతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థి విశాల్​ పాటిల్​.. ‘వసంత్ దాదా కోపరేటివ్షుగర్ మిల్లు’కి ఛైర్మన్ . ఈ స్థానాల్లో మంగళవారం ఓటింగ్ జరుగుతుండటంతో గత వారం రోజులుగా పార్టీల ప్రచారం తారా స్థాయిలో సాగింది. ఈక్యాంపె యిన్ లో ఎక్కడా చెరకు రైతులకు దక్కాల్సిన బకాయిల గురించి ఒక్కమాట మాట్లాడలేదు.వాళ్ల మాటల కోసం ఎదురుచూస్తు న్న రైతులు డీలాపడ్డా రు.

రూ.4,000 కోట్లకు చేరిన బాకాయిలు

మహారాష్ట్రలో చెరకు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఈ నెల 15 నాటికి రూ.4,000 కోట్లకుచేరాయి. ప్రస్తుతం క్రషిం గ్ సీజన్ సాగుతోంది.దాదాపు 195 షుగర్‌‌ ఫ్యాక్టరీల్లో యంత్రాలు నడుస్తున్నా యి. వాటిలో 34 పరిశ్రమలే సాగు దార్లకు100 శాతం డ్యూస్ ని క్లి యర్ చేశాయి. పంటకుగిట్టుబాటు ధర లభిం చక, అమ్మిన పైరుకి మిల్లులనుంచి డబ్బులు రాక రాష్ట్రం చెరకు రైతాం గంతీవ్ర సంక్షోభంలో ఉంది. కేంద్రంపై ఒత్తిడి కూడా పెరిగింది. షుగర్ సెక్టార్ కి సాయం చేయడానికిమోడీ సర్కారు వరస పెట్టి కొన్ని చర్యలు తీసుకుంది.కానీ, అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేక పోయాయి.అలయెన్స్​ వల్లే ఈ అలుసు గతంలో చక్కెర రైతుల తరఫున పోరాడిన స్వాభిమాని పక్ష పార్టీ ఈసారి కాం గ్రెస్ ఎన్ సీపీతో చేతులు కలిపింది. 2009, 2014ల్లో ఈ రెండు పెద్ద పార్టీలతో  ఫేస్ టూ ఫేస్ ఎలక్షన్ ఫైట్ చేసినప్పుడు…రాజు షెట్టి తన ప్రచారంలో రైతులకు రావాల్సిన బకాయిల గురించి , మద్దతు ధర గురిం చే ఎక్కువగా డిమాండ్ చేసేవారు. ప్రస్తుతం రాజకీయ సమీకరణలు మారటంతో ఆయన ఇంతకుముం దు మాదిరిగా కేవలం రైతుల పక్షానే నిలిచే పరిస్థితి లేకపోయిం ది.షుగర్ సెక్టార్ లో బడా వ్యాపారి, ఎన్ సీపీ స్టేట్ ప్రెసిడెంట్ అయిన జయంత్ పాటిల్​తో రాజు షెట్టి ఉమ్మడిగా ప్రచార సభలో పాల్గొంటున్నారు . శివసేన లీడర్ సంజయ్ మాండ్లిక్​ వాదన మరోలా ఉంది.ముందు ప్రభుత్వం బకాయిలను చెల్లించాలంటున్నారు . ఆ తర్వాత తాము కూడా రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తామని మెలిక పెడుతున్నారు .రాజకీయ నాయకులు ఎవరి ప్రయోజనాలు వాళ్లే చూసుకుంటున్న నేపథ్యంలో రైతుల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.