జకర్తా : ఇండియా స్టార్ షట్లర్ లక్ష్యసేన్.. ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీలో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21–9, 21–15తో కెంటా నిషిమోటో (జపాన్)పై గెలిచాడు. 45 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ స్మాష్‌లు, ర్యాలీస్‌లో ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో ప్రియాన్షు రజావత్ 21–10, 21–17తో కున్లావట్ విదిత్సరన్ (థాయ్‌లాండ్)పై గెలిచాడు.
విమెన్స్ డబుల్స్‌లో ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్ 21–19, 19–21, 19–21తో మయు మట్సుమోటో–వాకనా నగహర (జపాన్) చేతిలో, తనీషా క్రాస్టో–అశ్విని పొనప్ప 13–21, 21–19, 13–21తో బీక్ హా న–లీ సో హి (చైనీస్‌తైపీ) చేతిలో, మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్ రెడ్డి–సిక్కి రెడ్డి 9–21, 11–21తో జెంగ్ సీ వీ–హుయాంగ్ య క్వియాంగ్ (చైనా) చేతిలో ఓడారు.