
ఫోర్ట్ వర్త్ (యూఎస్‌ఏ) : ఇండియా యంగ్ షట్లర్లు పుల్లెల గాయత్రి, ట్రీసా జాలీ యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. శుక్రవారం జరిగిన విమెన్స్ డబుల్స్ రెండో రౌండ్‌లో రెండో సీడ్ గాయత్రి–ట్రీసా 16–21, 21–11, 21–16తో సియా పీ షన్–హంగ్ ఎన్ జుపై విజయం సాధించారు.
మెన్స్ సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ ప్రియాన్షు రజావత్ 21–18, 21–16తో నాలుగో సీడ్ లీ లాన్ జి (చైనా)పై గెలిచి క్వార్టర్స్ చేరాడు. విమెన్స్‌లో మాళవిక 15–21, 21–19, 21–14తో టెరెజా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది.