![ఆసియా మిక్స్‌డ్ టీమ్ టోర్నీ నుంచి తప్పుకున్న పీవీ సింధు](https://static.v6velugu.com/uploads/2025/02/shuttler-pv-sindhu-withdraws-from-badminton-asia-mixed-team-championships-2025-due-to-hamstring-issues_lvY3wcxWsh.jpg)
న్యూఢిల్లీ: ఆసియా మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొడ కండరాల సమస్యతో స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ నెల 11 నుంచి 16 వరకు జరిగే టోర్నీ నుంచి తప్పుకుంది. గత ఎడిషన్‌లో కాంస్యం నెగ్గిన జట్టులో ప్లేయర్ అయిన సింధు ఈసారి పతకం రంగు మారుస్తుందని ఆశించారు.
లక్ష్యసేన్, ప్రణయ్, సాత్విక్–చిరాగ్ జోడీతో కూడిన ఇండియా టీమ్ ప్రస్తుతం గుహవాటిలో ట్రెయినింగ్‌లో ఉంది. ‘టోర్నీ కోసం నేను టీమ్‌తో పాటు వెళ్లడం లేదు. ట్రెయినింగ్ సందర్భంగా నా తొడ కండరాలు నొప్పిగా అనిపించాయి. ట్యాపింగ్‌తో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. నేను కోలుకోవడానికి ఊహించిన దానికంటే ఎక్కువ టైమ్ పడుతుందని ఎంఆర్‌ఐలో తేలింది. కాబట్టి ఈ చాంపియన్‌షిప్ నుంచి తప్పుకుంటున్నా’ అని సింధు వెల్లడించింది.