
బెట్టింగ్ యాప్ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల్ విచారణకు హాజరయ్యారు యాంకర్ శ్యామల. న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు శ్యామల. ఇప్పటి వరకుఈ కేసులో టేస్టీ తేజ,కానిస్టేబుల్ కిరణ్, విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించారు. విష్ణుప్రియ, రీతూ చౌదరి మార్చి 25న మరోసారి ఎంక్వైరీకి రానున్నారు. యాంకర్ శ్యామల తనపై ఉన్న ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. ఆమెను అరెస్ట్ చేయకూడదని పోలీసులకు, విచారణకు సహకరించాలని శ్యామలకు కోర్టు ఆదేశాలిచ్చింది.
వీరితో పాటు సన్నీ యాదవ్ , అజయ్, సుధీర్ ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం. ఈ కేసులో పరారీలో ఉన్న వారికి మరోసారి నోటీసులిచ్చేందుకు పోలీసులు భావిస్తున్నారు.
Also Read : యూట్యూబర్ హర్ష సాయి పై కేసు నమోదు
అటు మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో విజయ్‌దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల, శోభా శెట్టి, సిరి హన్మంతు, శ్రీముఖి సహా పంజాగుట్ట పీఎస్‌లో విచారణ ఎదుర్కొంటున్న 11 మందిపైనా కేసు నమోదు కాగా, ఈ ఎంక్వైరీ ఇంకా మొదలుకాలేదు. మొదట బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మీడియేటర్లను విచారించిన తర్వాత సెలబ్రిటీలను విచారణకు పిలుస్తారని సమాచారం.