టీటీడీ ఈఓగా భాద్యతలు స్వీకరించిన శ్యామలరావు

టీటీడీ ఈఓగా భాద్యతలు స్వీకరించిన శ్యామలరావు

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నూతన ఈఓగా 1997 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన జే.శ్యామలరావు భాద్యతలు స్వీకరించారు. 2024, జూన్ 16వ తేదీ ఆదివారం  క్షేత్ర సాంప్రదాయం అనుసరిస్తూ శ్యామలరావు దంపతులు మొదట వరాహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని గరుడ ఆళ్వార్ సన్నిధిలో శ్యామలరావు బాధ్యతలను  స్వీకరించారు.

 ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు టీటీడీ ఈవో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులందరికీ మంచి సౌకర్యాలు కల్పిస్తామపి.. భక్తులు ఆనందంగా వెళ్లేలా చూస్తామని చెప్పారు. ప్రతీ పనిలో పారదర్శకత ఉండేలా చూస్తామన్నారు. ఆలయం అభివృద్ధిపై ప్రత్యేక విజన్ ఉందని చెప్పారు. నిధులు దుర్వినియోగం జరగకుండా .. సక్రమంగా వినియోగించుకుంటామని శ్యామలరావు తెలిపారు.