శ్యామ్ చెల్లెలి పెళ్లి బాధ్యత మాది : ఎన్టీఆర్ స్వచ్ఛంద సంస్థ

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ చనిపోయిన సంగతి తెలిసిందే. జూన్ 25 ఆదివారం రోజున అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో శ్యామ్ కుటుంబంలో విషాదం నెలకొంది. చేతికందొచ్జిన కొడుకు ఇలా అర్దాంతరంగా చనిపోవడంతో.. శ్యామ్ తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే శ్యామ్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమైనా.. చనిపోయే ముందు శ్యామ్ తీసుకున్న సెల్ఫీ వీడియోతో అనుమానాలకు ఫులిస్టాప్ పడింది.

ఇక ఎన్టీఆర్ కూడా శ్యామ్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ నోట్ కూడా రిలీజ్ చేశారు. అభిమాని మరణ వార్త..తన మనసును కలచివేసిందని తెలిపారు. ఇక శ్యామ్ మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న శ్యామ్ తల్లిదండ్రులకు పెద్ద దిక్కుగా మారింది "రా ఎన్టీఆర్" స్వచ్ఛంద సంస్థ.  శ్యామ్ చెల్లెలి పెళ్లి భాద్యత తమదే అని ప్రకటించింది. 

ALSO READ:దేశానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరం : ప్రధాని మోడీ

"పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. కానీ, శ్యామ్ కుటుంబానికి మేము అండగా నిలుస్తాం. ఇప్పటికే శ్యామ్ తల్లిదండ్రులతో మాట్లాడాం. వాళ్లకి అన్ని విధాలుగా ధైర్యాన్ని ఇచ్చాం. శ్యామ్ తన కుటుంబానికి వెన్నెముక లాంటోడు. తను లేని లోటు ఆ కుటుంబానికి మనమెవ్వరం తీర్చలేనిది. అందుచేత, శ్యామ్ చెల్లెలి పెళ్లి బాధ్యత మేము తీసుకున్నాం" అంటూ రా ఎన్టీఆర్ సంస్థ ప్రకటించింది. దీంతో ఈ సంస్థ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.