నార్కట్పల్లి, వెలుగు : ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్ఐ అంతిరెడ్డి హెచ్చరించారు. బుధవారం నార్కట్పల్లి రైతు వేదికలో నకిలీ విత్తనాల నిర్మూలనపై వ్యవసాయ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో డీలర్లకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నకిరేకల్ వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు రామారావు నాయక్, ఎస్ఐ మాట్లాడుతూ వానాకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల అమ్మకంలో డీలర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. డీలర్లు లైసెన్స్లేకుండా వ్యాపారం ప్రారంభించరాదని, అమ్మినటువంటి విత్తనాలు, ఎరువుల వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు.