
పంజాగుట్ట, వెలుగు: డ్యూటీలో ఉన్న మధురానగర్ఎస్ఐ సాయినాథ్‌రెడ్డిపై దాడి జరిగింది. ఎల్లారెడ్డిగూడ లా కాలేజీ సమీపంలో సౌండ్ పొల్యూషన్ పై ఫిర్యాదు రావడంతో ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి వెళ్లారు. అక్కడి ఒక ఇంట్లో ఫంక్షన్ జరుగుతుండగా, నలుగురు వ్యక్తులు ధీరజ్, గణేశ్, అజయ్, రాహుల్ బ్లూటూత్ స్పీకర్లతో అధిక సౌండ్‌తో పాటలు ప్లే చేస్తున్నట్లు గుర్తించారు.
వారిని ఆపడానికి ప్రయత్నించగా, తాము పాటలు పెట్టుకుంటే మీకేంటని ఎదురు ప్రశ్నించారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ధీరజ్ ఎస్ఐపై దాడి చేశాడు. ఇందుకు మిగిలిన ముగ్గురు సహకరించారు. వారిలో ధీరజ్ తాను హైకోర్టు న్యాయవాదినని ఎస్ఐని బెదిరించాడు. ఘటన జరిగిన ప్రాంతం పంజాగుట్ట పీఎస్ లిమిట్స్‌లోకి రావడంతో ఎస్ఐ వారిపై ఫిర్యాదు చేశారు.
దీంతో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆటకం కలిగించిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.