మునుగోడులోని బంగారిగడ్డలో జరిగిన సీఎం కేసీఆర్ సభలో ఎస్సై, కానిస్టేబుల్ ఎంట్రన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థులు నిరసన తెలిపారు. ఎంట్రన్స్ పరీక్షలో 22 ప్రశ్నలు తప్పుగా ఇచ్చారన్నారు. వాటికి మార్కులు కలపకుండా ఫలితాలు రిలీజ్ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 8 మంది అభ్యర్థులు చనిపోయారన్నారు. తమకు న్యాయం చేయాలంటూ.. సీఎం సభ ముందు అభ్యర్థులు ఆందోళన చేపట్టారు.
సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి చండూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, మునుగోడు ఉప ఎన్నిక నవంబరు 3న జరగనుండగా, టీఆర్ఎస్ పార్టీ ఇవాల చండూరులో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు విచ్చేసిన సీఎం కేసీఆర్ ప్రధానంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు.