ధర్నా చేస్తున్న కార్యకర్తను కడుపులో తన్నిన ఎస్సై

ధర్నా చేస్తున్న కార్యకర్తను కడుపులో తన్నిన ఎస్సై

బీజేపీ కలెక్టరేట్ ముట్టడి.. కార్యకర్తను తన్నిన ఎస్సై

పోలీస్​ స్టేషన్​ ఎదుట లీడర్ల ధర్నా

మంచిర్యాల, వెలుగు: ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఓ ఎస్సై అత్యుత్యాహం ప్రదర్శించారు. కార్యకర్తను మోకాలితో కడుపులో తన్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో బుధవారం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు ఆధ్వర్యంలో బుధవారం వందలాది నాయకులు, కార్యకర్తలు  మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి మున్సిపల్ ఆఫీస్, వాటర్ ట్యాంక్, శ్రీనివాస్ టాకీస్, కాలేజీ రోడ్డు మీదుగా భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ను ముట్టడించారు. కలెక్టరేట్ గేట్ ఎదుట బైఠాయించి సర్కారు తీరుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.  పోలీసులు బీజేపీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. లీడర్ల అరెస్ట్ సందర్భంగా రామకృష్ణాపుర్ ఎస్సై రవిప్రసాద్ అత్యుత్సాహం ప్రదర్శించారు. చక్రవర్తి అనే కార్యకర్తను దూషిస్తూ మోకాలితో కడుపులో తన్నారు. దురుసుగా ప్రవర్తించిన ఎస్సైపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ లీడర్లు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని ఏసీపీ చెప్పడంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు ఎస్సైపై కంప్లైంట్ చేశారు.

For More News..

ఈఫిల్ టవర్‌‌‌‌కు బాంబు బెదిరింపు

భారత శాటిలైట్స్‌పై చైనా ఎటాక్

8 రోజుల ముందుగానే ముగిసిన పార్లమెంట్ సమావేశాలు