సీనియర్ను కాల్చిచంపి.. తనూ కాల్చుకున్నడు

ఢిల్లీలో సీఆర్పీఎఫ్ ఎస్ఐ దారుణం

న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ తన సీనియర్ను కాల్చిచంపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీలోని లోథా ఎస్టేట్ ఏరియాలోని కేంద్ర హోం శాఖ వీరికి అలాట్ చేసిన బంగ్లాలోనే ఈ ఘటన జరిగింది. ఓ విషయంలో జరిగిన గొడవే కాల్పులకు కారణమని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. 122వ సీఆర్పీఎఫ్ బెటాలియన్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ కరనైల్ సింగ్ (55), ఇన్స్పెక్టర్ దశరథ్ సింగ్(56) మధ్య ఓ విషయంలో గొడవ జరిగింది. దీంతో కరనైల్ సింగ్.. తన సర్వీస్ రివాల్వర్ తో దశరథ్ ను కాల్చేశాడు. ఆ తర్వాత బిల్డింగ్ గేట్ దగ్గరకు వచ్చి తనను తాను కాల్చుకుని చనిపోయాడు. కరనైల్ సింగ్ జమ్మూకాశ్మీర్లోని ఉదమ్పూర్ కు చెందిన వాడు కాగా.. దశరథ్ సింగ్ హర్యానాలోని రోహ్ తక్ కు చెందిన వాడు. లోకల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీరి మధ్య గొడవకు కారణం ఏమిటనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించినట్టు సీఆర్పీఎఫ్ వర్గాలు తెలిపాయి.

For More News..

దేశంలో కొన్నిచోట్ల మళ్లీ లాక్‌డౌన్

యూఎస్ సర్కార్‌‌‌‌పై ఇండియన్ మహిళ కేసు

అవసరమైతే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాం..