హెడ్ కానిస్టేబుల్ కు గుండెపోటు .. సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన ఎస్‌‌‌‌ఐ కృష్ణ సాగర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

హెడ్ కానిస్టేబుల్ కు గుండెపోటు .. సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన ఎస్‌‌‌‌ఐ కృష్ణ సాగర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

కడెం, వెలుగు: నిర్మల్ జిల్లా కడెం మండలం పాండవపూర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ లో భాగంగా విధులు నిర్వహిస్తున్న దస్తురాబాద్  పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గోకుల్ దాస్ కు హార్ట్‌‌‌‌ ఎటాక్ రావడంతో  కుప్పకూలిపోయాడు. 

వెంటనే స్పందించిన సిబ్బంది ఎస్‌‌‌‌ఐకు సమాచారం అందజేయగా..  హుటాహుటిన వచ్చిన కడెం ఎస్‌‌‌‌ఐ కృష్ణసాగర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్‌‌‌‌ గోకుల్ దాస్‌‌‌‌కు సీపీఆర్ చేసి ప్రాణాన్ని కాపాడారు. నిర్మల్ దవాఖానకు తరలించినట్లు ఎస్‌‌‌‌ఐ తెలిపారు.