కొత్తగూడ, వెలుగు: ఈ నెల 8న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగపర్చుకోవాలని కొత్తగూడ ఎస్సై కుష్ కుమార్ సూచించారు. శుక్రవారం కొత్తగూడలోని కొమురం భీం విగ్రహం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం క్యూ ఆర్ కోడ్ ద్వారా జాబ్ మేళాకు దరఖాస్తు చేసుకునే విధానాన్ని యువతకు అవగాహన కల్పించారు. మహబూబాబాద్ఏబీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ జాబ్ మేళాలో సుమారు 40 కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు.