మాక్లూర్, వెలుగు : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాక్లూర్ ఎస్ఐ ఎం. రాజశేఖర్ చెప్పారు. ఆదివారం మాక్లూర్ మండల కేంద్రంలోని ధర్మశాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, కొత్త చట్టాలపై అవగాహన కలిగించారు.
వివిధ రకాల నేరాల గురించి వివరిస్తూ ఆన్లైన్ మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకుంటే 1930 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనీల్ కుమార్ కులకర్ణి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్వర్ రావు గ్రామస్తులు పాల్గొన్నారు.