నవాబుపేట, వెలుగు: మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన లంబ గోపాల్ వద్ద ఉన్న రూ.4.90 లక్షలు సీజ్ చేసినట్లు ఎస్ఐ పురుషోత్తం తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, గోపాల్ తీసుకెళ్తున్న నగదును గుర్తించారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
పెబ్బేరు: మండలంలోని రంగాపూర్ చెక్‌పోస్ట్ వద్ద కారులో తీసుకెళ్తున్న రూ.4 లక్షలను పోలీసులు పట్టుకున్నట్లు ఎస్ఐ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. ఏపీలోనికర్నూల్ జిల్లా గుంతకల్ ప్రాంతానికి చెందిన గోదా రంగనాథ రామానుజ కూటమి ఛారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన పెరుమాల బాలసుధాకర్ తదితరులు గుంతకల్ నుంచి మధురకు వెళ్లేందుకు 170 మందికి ట్రైన్ టికెట్ల బుకింగ్ కోసం హైదరాబాద్‌కు వెళ్తున్నారు. రంగాపూర్ వద్ద ఎస్ఎస్టీటీమ్, పోలీసులు తనిఖీ చేయగా, రూ.4 లక్షలు దొరికాయి. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అమౌంట్‌ను సీజ్ చేసినట్లు ఎస్ఐ చెప్పారు.
చిన్న చింతకుంట: కర్ణాటక రాష్ట్రం గంగావతికి చెందిన రాజ్యసభ అనే వ్యక్తి వద్ద ఉన్న రూ1.02 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ఆర్ శేఖర్ తెలిపారు. లాల్కోట చౌరస్తా చెక్‌పోస్ట్ లో తనిఖీ చేయగా, ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న నగదు దొరికిందని చెప్పారు. నగదుతో పాటు అశోక్ లేలాండ్ వెహికల్‌ను సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
ALS0 READ: సీన్లో దమ్ము లేకపోతే నేనేం చేయాలి