
హసన్‌పర్తి, వెలుగు : పోక్సో కేసులో అరెస్ట్ అయిన భూపాలపల్లి జిల్లా సైబర్ క్రైం సీఐ బండారి సంపత్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కేయూ పీఎస్‌లో ఎస్సైగా పనిచేస్తున్న టైంలో సంపత్ ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీఆర్‌కు అటాచ్ చేశారు. తర్వాత సీఐగా ప్రమోషన్ పొందిన సంపత్‌కుమార్ భూపాలపల్లి సైబర్ క్రైం సీఐగా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో మళ్లీ ఆ మహిళతో సంబంధం కొనసాగించడంతో పాటు, ఇటీవల ఆమె కుమార్తెపై అత్యాచారానికి యత్నించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు సంపత్‌ను అరెస్ట్ చేశారు. దీంతో అతడిని సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఏవీ. రంగనాథ్ శనివారం ఆర్డర్స్ జారీ చేశారు.