300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

తూప్రాన్ , వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తూప్రాన్ టోల్​గేట్​వద్ద గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడినట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ లారీలో 280 క్వింటాళ్లు, ఆటోలో 28 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకొని రేషన్ బియ్యాన్ని పీఎస్​తరలించామన్నారు. 

లారీ డ్రైవర్ నిరాజ్ కుమార్, బియ్యం యజమాని భాస్కర్ రెడ్డి , చింటయ్య, ఆటో డ్రైవర్ బాలాజీ, ఆటో ఓనర్ తేజవత్ రవిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.