కలికోటపల్లిలో రెండు ఇసుక ట్రాక్టర్లు,టిప్పర్ పట్టివేత

మొగుళ్లపల్లి( టేకుమట్ల)వెలుగు :  మండలంలోని  గర్మిళ్లపల్లి శివారు కలికోటపల్లి దగ్గరలో గల మానేరు వాగు  నుంచి  అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు, టిప్పర్ ను పట్టుకున్నట్లు ఎస్సై  సుధాకర్ చెప్పారు.  భూపాలపల్లి మండలం నేరేడుపల్లికి చెందిన పుట్టపాక దేవేందర్, మెట్టు రజినీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు తమ ట్రాక్టర్లతో దొంగతనంగా మానేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నారని సమాచారం మేరకు పట్టుకొని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

అలాగే రేగొండ మండలం దమ్మన్నపేటకు చెందిన నడిపెల్లి శ్రీనివాసరావుకు చెందిన టిప్పర్ లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా స్థానికుల సమాచారం మేరకు పట్టుకొని టిప్పర్ డ్రైవర్ మొగుళ్లపల్లి మండలం మేదరమట్ల కు చెందిన  కట్ల ప్రణయ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. వాగుల నుంచి ఇసుకను అనుమతి లేకుండా తరలించినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై హెచ్చరించారు.