మొగుళ్లపల్లి, వెలుగు : ఓ రౌడీషీటర్ బర్త్‌డే వేడుకలను ఎస్సై దగ్గరుండి మరీ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఎస్సైని ఆసిఫాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో ఇటీవల జరిగింది. ఓ మర్డర్ కేసులో నిందితుడైన రౌడీషీటర్ వేముల మహేందర్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 3న పోలీస్‌స్టేషన్‌లోనే ఎస్సై మాధవ్‌గౌడ్ దగ్గరుండి మరీ కేక్ కట్ చేయించారు.
ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయించారు. తర్వాత ఎస్సై మాధవ్‌గౌడ్‌ను ఆసిఫాబాద్ ఎస్పీకి అటాచ్డ్ చేస్తూ ఆర్డర్స్ జారీ చేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మేడారం ఎస్‌హెచ్‌వోగా పనిచేస్తున్న అశోక్‌ను మొగుళ్లపల్లి ఎస్సైగా నియమించారు.