
నవాబుపేట, వెలుగు: మండలంలోని ఇప్పటూరు గ్రామానికి చెందిన శిరీష(21) అదృశ్యమైనట్లు ఎస్ఐ విక్రం తెలిపారు. గ్రామానికి చెందిన శిరీష ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 23న కారుకొండ గ్రామంలో బంధువు అంత్యక్రియలకు పేరెంట్స్ వెళ్లగా, అప్పటి నుంచి కూతురు కనిపించలేదు. ఆచూకీ లభించకపోవడంతో శనివారం తండ్రి శాంతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.