వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఎస్సై వీరేందర్ సస్పెండ్ చేశారు. రఘునాథపల్లి ఎస్సైగా పని చేసిన ఎన్. వీరేందర్ గతంలో ఓ వ్యవసాయ భూవివాదంలో తలదూర్చారు. ఈ కేసులో నిందితులకు సహకరించడంతో అప్పట్లోనే ఆయన్ను వీఆర్ కు అటాచ్ చేశారు.
ఆ తర్వాత భూవివాదంపై పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టాక.. వారికి సహకరించికపోగా.. బాధితులను ఇబ్బందులకు గురి చేస్తూ నిందితులకు సపోర్ట్ చేస్తున్నట్టు తేలింది. దీంతో ఎస్సై వీరేందర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.