నారా రోహిత్ హీరోగా నటించిన చిత్రం ‘సుందరకాండ’. వృత్తి వాఘని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడు. బుధవారం ఈ చిత్రం నుంచి ‘బహుశ బహుశ’ అనే పాటను విడుదల చేశారు. లియోన్ జేమ్స్ కంపోజ్ చేయగా సిద్ శ్రీరామ్ పాడాడు.
‘బహుశ బహుశ బహుశ.. తరగతి గదిలో ఆగావా ఓ మనసా.. తిరిగొస్తూనే ఉంటానని నీకలుసా..’ అంటూ స్కూల్ డేస్ నాటి తన ఫస్ట్ క్రష్ శ్రీదేవి విజయ్ కుమార్ గురించి హీరో గుర్తుచేసుకుంటున్నట్టుగా పాటను ప్రారంభించారు.
‘ఎగిరే తారాజువ్వా.. చూస్తే అది నీ నవ్వా.. పొగిడే మాటలు ఎన్నున్నా సరిపోవా..కళ్లతో నవ్వే కలువా..ఊహలకు అందని విలువ ’ అంటూ శ్రీహర్ష ఈమాని రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి.
ప్రభాస్ డెబ్యూ సినిమా ఈశ్వర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ దేవి విజయ్ కుమార్ ఈ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు, సీనియర్ నటుడు నరేష్ విజయ కృష్ణ రోహిత్ తండ్రిగా కనిపించారు.వాసుకి ఆనంద్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 6న రిలీజ్ కానుంది.