
ముడా ల్యాండ్ కేసులో కర్ణాకట సీఎం సిద్దరామయ్యకు క్లీన్ చిట్ ఇచ్చింది లోకాయుక్త.ఈ కేసులో సిద్దరామయ్యకుగానీ, అతని భార్య, కుటుంబసభ్యులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు లోకాయుక్త పోలీసులు. ముడా ల్యాండ్ స్కామ్ లో సీఎం సిద్దరామయ్య, అతని భార్య, ఇతర కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని ఎటువంటి ఆధారాలు లభించలేదని హైకోర్టుకు సమర్పించిన ఫైనల్ రిపోర్టులో లోకాయుక్త పోలీసులు తెలిపారు.
ముడా ల్యాండ్ స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఆయన బావమరిది మల్లికార్జున స్వామి, భూ యజమాని దేవరాజు కూడా నిందితులుగా ఉన్నారు.ఈ నలుగురు నిందితులపై ఆరోపణలకు ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదని, ఆరోపణలు రుజువు కాలేదని లోకాయుక్త పోలీసులు హైకోర్టు కు తెలిపారు.
ఏంటీ ముడా స్కామ్ కేసు..
మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ భూ కేటాయింపుల్లో విలువైన భూముల్ని సిద్దరామయ్య భార్య పార్వతికి కట్టబెట్టారని టీజే అబ్రహాం, ఎస్సీ ప్రదీప్ , స్నేహమయి కృష్ణ లు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు విచారణకు అనుమతిచ్చారు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్.
Also Read : కుంభమేళా స్నానంపై పొలిటికల్ వార్
మైసూరులోని కేసరి గ్రామంలో సిద్దరామయ్ భార్యకు 3 ఎకరాల భూమి ఉంది. అది సిద్దరామయ్య బామ్మర్ది పార్వతికి బహుమతిగా ఇచ్చారు. అయితే ముడా డెవలప్ మెంట్ లో భాగంగా ఆ భూమిని ప్రభుత్వం తీసుకుంది.. బదులుగా మైసూర్ లోని విజయ్ నగర్ ప్రాంతంలో 38వేల 283 చదరపు అడుగుల ప్లాట్ ను కేటాయించింది. అయితే కేసరి గ్రామంలో పార్వతి పేరున ఉన్న భూమికంటే ప్రభుత్వం ఆమెకు కేటాయించిన భూమి చాలా విలువైనదని ఫిర్యాదులు ఆరోపించారు. దీంతో ముడా కేసు వెలుగులోకి వచ్చింది..
2024 మార్చిలో ముడా ల్యాండ్ స్కామ్ లో సీఎం సిద్దరామయ్య అతని భార్య పార్వతి, మరికొంత మంది రాజకీయ నేత ప్రమేయం ఉందని ఫిర్యాదులు వచ్చాయి. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన లోకాయుక్త పోలీసులు గురువారం (ఫిబ్రవరి19)న సీఎం సిద్దరామయ్య, అతని భార్య, మరో ఇద్దరికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని లోకాయుక్త పోలీసులు కర్ణాటక హైకోర్టుకు ఫైనల్ రిపోర్టు సమర్పించడంతో సిద్దరామయ్య ఫ్యామిలీకి భారీ ఊరట లభించింది.