ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం.. శక్తి స్కీమ్ను ప్రారంభించిన సీఎం

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం.. శక్తి  స్కీమ్ను ప్రారంభించిన సీఎం

కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని(శక్తి పథకం ) ఆ రాష్ట్ర  సీఎం సిద్ధరామయ్య ప్రారంభించారు.   ఈ పథకం లోగోను ఆవిష్కరించి సీఎం..    ఐదుగురు మహిళలకు శక్తి స్మార్ట్‌కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ పథకాన్ని మంత్రులు తమ జిల్లాల్లో ప్రారంభించాలని, శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. 

మధ్యాహ్నం 1 గంట నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్ టీసీ, బీఎంటీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.ఈ ఫథకం ద్వారా  రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతున్న మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం ద్వారా ప్రతిరోజూ 41.8 లక్షల మంది మహిళా ప్రయాణీకులకు ప్రయోజనం చేకూరుస్తుందని అధికారులు తెలిపారు.   రాష్ట్ర ఖజానాకు ఏటా రూ. 4,051.56 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు .

అధికారుల వివరాల ప్రకారం, కుల, మతం అనే వివక్ష లేకుండా  మహిళలందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. మహిళలు 'సేవా సింధు' ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా శక్తి స్మార్ట్ కార్డ్ ను పొందవచ్చునని ప్రభుత్వం తెలిపింది.  కర్ణాటక పరిధిలో మాత్రమే ఇది వర్తిస్తుందని.. ఇతర రాష్ట్రాలకు వెళ్లే కర్ణాటక బస్సుల్లో కానీ, కర్ణాటకలోకి వచ్చే ఇతర రాష్ట్రాల బస్సుల్లో కానీ ఈ పథకం పనిచేయదని అధికారులు తెలిపారు.

రాజహంస, వజ్ర, వాయువజ్ర, ఐరావత, అంబారీ, అంబారీ ఉత్సవ్, ఎఫ్టీ బస్, ఈవీ పవర్ ప్లస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని అధికారులు తెలిపారు.  ప్రభుత్వ జీవో ప్రకారం.. ఉచిత బస్సు ప్రయాణ సేవలు మహిళలు, హిజ్రాలుకు ఈ పథకం కూడా వర్తిస్తుంది.  కర్ణాటకఅసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఐదు హామీల్లో ఇదే మొదటిది.