తెలంగాణకు మోదీ వంద సార్లు వచ్చినా బీజేపీకి డిపాజిట్లు రావు: సిద్ధరామయ్య

తెలంగాణకు మోదీ వంద సార్లు వచ్చినా బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు రావని..కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు.  కర్ణాటకలో మోదీ 48 సభలు,రోడ్ షోల్లో పాల్గొన్నారని..  మోదీ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ గెలిచిందన్నారు. ఇన్ని అబద్ధాలు చెప్పే ప్రధానిని ఇంతవరకు  చూడలేదన్నారు. అబద్ధాలు చెప్పే ప్రధానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. బీసీల వెనుకబాటు తనానికి ప్రధాని మోదీ కారణమన్నారు.   మోదీ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు సిద్ధరామయ్య.

 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు సిద్ధరామయ్య. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అమలవుతున్నాయో లేదో కేసీఆర్ కర్ణాటకకు వస్తే దగ్గరుండి చూపిస్తామన్నారు.  కర్ణాటకలో 5 గ్యారంటీ స్కీంలను పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ కు బీజేపీకి తేడా లేదని..బీఆర్ఎస్.. బీజేపీ బీ టీం అని ఆరోపించారు.

కామారెడ్డిలో కేసీఆర్ ను రేవంత్ రెడ్డి చిత్తుగా ఓడించడం ఖాయమన్నారు సిద్ధరామయ్య.   సీఎం  కేసీఆర్ కు రెండు నియోజకవర్గాల్లో  ఓటమి తప్పదన్నారు. రేవంత్ కామారెడ్డితో పోటు కొడంగల్ రెండు చోట్ల గెలుస్తారన్నారు. బీసీల 34 రిజర్వేషన్లు 25 శాతానికి తగ్గించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.మోదీ తరహాలో వెనబడిన వర్గాలను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ అవినీతి డబ్బును ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.   పదేళ్ల కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడాలన్నారు. అవినీతి సొమ్ముతో ఓట్లను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు.ఎన్నికల్లో బీఆర్ఎస్,బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ ను ఆశీర్వదించాలన్నారు.