భారత క్రికెట్ కు మరో క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ భారత క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. గురువారం (నవంబర్ 28) ఇంస్టాగ్రామ్ వేదికగా కౌల్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. "నేను పంజాబ్‌లోని గ్రౌండ్స్ లో క్రికెట్ ఆడుతున్నప్పుడు నా దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే ఒక కల ఉండేది. 2018లో దేవుడి దయతో నేను T20 జట్టులో చోటు దక్కించుకున్నాను. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించే సమయం ఆసన్నమైంది". అని కౌల్ రాసుకొచ్చాడు.
2018లో సిద్ధార్ధ్ కౌల్ భారత జట్టులో టీ20 క్రికెట్ తో అరంగేట్రం చేశాడు. టీమిండియా తరపున కేవలం మూడు వన్డేలు.. మూడు టీ20లు మాత్రమే ఆడాడు. వన్డేల్లో ఒక వికెట్ దక్కపోగా.. టీ20నాలుగు వికెట్లు పడగొట్టాడు. 2019 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన ఈ పంజాబీ పేసర్ ఈ ఐదేళ్లలో భారత జట్టులో చోటు సంపాదించడంలో విఫలమయ్యాడు.
34 ఏళ్ల కౌల్.. పంజాబ్ తరఫున 88 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 26.77 సగటుతో 297 వికెట్లు తీశాడు. 17 సార్లు 5 వికెట్ల ఘనతను సాధించాడు. 2008 అండర్-19 ప్రపంచ కప్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ గెలుచుకున్నప్పుడు జట్టులో బౌలర్. 2016 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరాడు. 55 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 8.63 ఎకానమీతో 58 వికెట్లు పడగొట్టాడు.
SIDDHARTH KAUL ANNOUNCED HIS RETIREMENT FROM INDIAN CRICKET....!!
— Johns. (@CricCrazyJohns) November 28, 2024
- The 2008 U-19 batch with Kohli & Backbone of SRH in 2018 IPL. pic.twitter.com/U5W3Ma763J