
బచ్చన్నపేట, వెలుగు: జనగామ జిల్లా కొడువటూరు సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ ఆవరణలోని పురాతన బావి వద్ద గంగ పూజ చేసి, స్వామివారికి ఆ నీటిని తీసుకువచ్చి అభిషేకం చేశారు. సాయంత్రం శతరుద్రాభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం తీర్థప్రసాద వినియోగం జరిపించారు.
మహాశివరాత్రి సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రోహిత్‌సింగ్, ఆర్డీవో గోపీరాం, ఏసీపీ చేతన్నిత్, డీపీవో స్వరూప స్వామివారి కల్యాణ ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుముందు అడిషనల్ కలెక్టర్అధికారులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈవో వంశీతో మాట్లాడి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.