
బచ్నన్నపేట, వెలుగు: మహా శివరాత్రిని పురస్కరించుకొని కొడవటూరు సిద్దేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం స్వామివారి కల్యాణం సందర్భంగా ప్రభుత్వం తరపున ప్రముఖులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈనెల 27 వరకు నిర్వహించే ఈ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
వసతి, వైద్య, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, వాలంటీర్లు పర్యవేక్షించేందుకు సిద్ధమయ్యారు. సిద్దుల గుట్టకు రావడానికి హైదరాబాద్, జనగామ, బచ్చన్నపేట, హుస్నాబాద్, ఆలేరు, సిద్దిపేట, గజ్వేల్, యాదగిరిగుట్ట ప్రాంతాలను భక్తులు బస్సుల సౌకర్యం ఏర్పాటు చేశారు. బచ్చన్నపేట నుంచి సిద్దుల గుట్టకు ఆటోల్లో వెళ్లవచ్చు.