Siddharth, Aditi Rao Hydari: జరిగింది పెళ్లి కాదు.. ఎంగేజ్మెంట్.. అధికారికంగా ప్రకటించిన అదితి

తమిళ హీరో సిద్దార్థ్(Siddarth), హీరోయిన్ అదితిరావు హైదరి(Adithi rao hydari) నిన్న(మార్చ్ 27) పెళ్లి చేసుకున్నారంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. తెలంగాణలోని వనపర్తి శ్రీరంగపురం టెంపుల్‌లో వీరి వివాహం రహస్యంగా జరిగిందని వార్తలు వినిపించాయి. కానీ, ఈ పెళ్లికి సంబందించిన ఏ ఒక్క ఫోటో గానీ.. వీడియో కానీ విడుదల కాలేదు.

నిజంగా ఈ పెళ్లి జరిగిందా అని జనాలు అనుమానాలు ఉన్న తరుణంలో.. ఒక పోస్ట్ తో పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది హీరోయిన్ అదితిరావు హైదరి. ఈ పోస్ట్ లో అదితి, సిద్దార్థ్ లు తీసుకున్న సెల్ఫీ ఫొటోని షేర్ చేస్తూ.. అతను ఓకే చెప్పాడు, ఎంగేజ్డ్ (E.N.G.A.G.E.D) అని పోస్ట్ రాసుకొచ్చింది. ఇద్దరూ ఎంగేజ్ మెంట్ సమయంలో ఒకరికి ఒకరు మార్చుకున్న ఉంగరాలను చూపిస్తూ ఫొటో షేర్ చేశారు వీళ్లిద్దరూ. మాకు జరిగింది ఎంగేజ్ మెంట్.. పెళ్లి కాదు అని క్లారిటీ ఇస్తూ.. త్వరలో పెళ్లికి అందర్నీ పిలుస్తామనే సంకేతాలు ఇచ్చారు.  

ఏదైతేనేం.. మూడేళ్ళుగా వినిపిస్తున్న ఈ జంట ప్రేమ వార్తలకు 2024, మార్చి 28వ తేదీ అధికారికంగా ప్రకటన ఇచ్చేసింది అదితి. పెళ్లి ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అదితి షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవ్వగా.. నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.