Siddarth, Aditirao Hyderi: సీక్రెట్గా పెళ్లిచేసుకున్న సిద్దార్థ్, అదితిరావు హైదరీ

తమిళ స్టార్ సిద్ధార్ద్(Siddarth), హీరోయిన్ అదితి రావ్ హైదరి(Aditi Rao Hydari)  సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. వీరి వివాహం వనపర్తిలోని శ్రీరంగపురం ఆలయంలో బుధవారం ఉదయం (మార్చి 27న) జరిగింది. అతి గోప్యాంగా జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రం హాజరయ్యారు. 

ఇక సిద్ధార్ద్, అదితి రావ్ గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఏ ఫంక్షన్స్‌కి, సినిమాలకి, పార్టీలకి వెళ్లినా ఇద్దరు కలిసే హాజరయ్యారు. దీంతో వీరి పెళ్లిపై కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతూనే వచ్చాయి. కానీ, ఇద్దరిలో ఎవరు కూడా ఆ వార్తలపై స్పందించలేదు. చివరకు ఈరోజు(మార్చ్ 27)  సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఫాన్స్ కొత్త జంటకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సిద్ధార్థ్‌కి ఇది రెండో పెళ్లి కాగా.. అదితికి కూడా రెండో వివాహమే.