Romantic Comedy OTT: సైలెంట్గా ఓటీటీకి వ‌చ్చిన సిద్దార్ధ్ లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ

లవర్ బాయ్ సిద్ధార్థ్ (Siddharth), బ్యూటీ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ యూ’(Miss You). ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో శామ్యూల్ మాథ్యూ నిర్మించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ డిసెంబర్‌ 13న తెలుగులో విడుదల అయింది. ఇపుడీ ఈ మూవీ నెలరోజుల్లోనే సైలెంట్గా ఓటీటీకి వచ్చేసింది.

మిస్ యూ ఓటీటీ:

 మిస్ యూ మూవీ ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఇవాల్టీ నుంచి (శుక్రవారం) ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ముందుగా ఈ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా స్ట్రీమింగ్కి వస్తుందని టాక్ వినిపించింది. ఇక ఎట్టకేలకు రాత్రి ఓటీటీ దర్శనం ఇవ్వడంతో అంత షాక్ అయ్యారు.

ALSO READ : Game Changer Review: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ.. శంకర్, రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా?

ఇకపోతే తమిళంలో ఆకట్టుకున్న ఈ మూవీ.. తెలుగు ఆడియన్స్ను అంతగా మెప్పించలేకపోయింది. అయితే, ఈ మూవీని దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా.. బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.6 కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. దాంతో మిస్ యూ మూవీ నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది. సినిమా కాన్సెప్ట్‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, బోరింగ్ స్క్రీన్‌ప్లే కార‌ణంగా ఈ మూవీ ఆడియన్స్కి పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. అంతేకాకుండాఈ సినిమా రిలీజైన టైంకి పుష్ప 2 థియేటర్స్లో ఉండటం పెద్ద మైనస్గా మారింది. 

కథేంటంటే:

వాసుగా సిద్ధార్థ్, సుబ్బలక్ష్మిగా ఆషికా రంగనాథ్ నటించారు. డైరెక్టర్ కావాలని కల కంటుంటాడు సిద్ధార్థ్.  ‘నచ్చిన దానికోసం మనం అన్ని విధాలుగా వీలైనంత వరకు ప్రయత్నించాలి. ఆ తర్వాత కూడా అది  దక్కలేదంటే అది మన తప్పు కాదు..’ అని కోణంలో సిద్ధార్థ్ ఆలోచిస్తుంటారు. అలా సినిమాల కోసం ప్రయత్నించే క్రమంలో ఓ ప్రమాదం వల్ల త‌న జీవితంలో చివ‌రిగా గ‌డిచిన రెండేళ్ల జ్ఞాప‌కాల్ని మ‌రిచిపోతాడు. ఆ తర్వాత ఒకరికికొకరు ప్రేమించుకున్న వాసు, సుబ్బలక్ష్మి ప్రేమ ఏమైంది? యాక్సిడెంట్ కార‌ణంగా వాసు మ‌ర్చిపోయిన రెండేళ్ల‌లో అస‌లు ఏం జ‌రిగింది? సుబ్బ‌ల‌క్ష్మి, వాసు తిరిగి ఒక్క‌ట‌య్యారా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.