భారత పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ ఇంగ్లాండ్ గడ్డపై అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్నాడు. కౌంటీ క్రికెట్ ఆడేందుకు వారం రోజుల క్రితమే ఇంగ్లాండ్ వెళ్లిన కౌల్.. తన తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
నార్తాంప్టన్‌షైర్ తరుపున బరిలోకి భారత పేసర్.. గ్లౌసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. మొత్తంగా 29 ఓవర్లు వేసిన 76 పరుగులిచ్చి.. బాన్‌క్రాఫ్ట్, ఒలివర్ ప్రైస్, జేమ్స్ బ్రేసి, వాన్ బ్యూరెన్, జాఫర్ గోహర్‌లను పెవిలియన్ చేర్చాడు. సిద్ధార్థ్ కౌల్ ప్రదర్శనపై నార్తాంప్టన్ కోచ్ జాన్ సాడ్లర్ ప్రశంసలు కురిపించారు.
కౌల్ అత్యుత్తమ పేసరన్న సాడ్లర్.. భారత సీమ్ బౌలర్ సత్తా తమకు తెలుసని తెలిపాడు. త్తోలి మ్యాచ్‍లోనే ఐదు వికెట్లు తీయడానికి అతను నిజంగా అర్హుడని కితాబిచ్చాడు.
Five wickets on his Northamptonshire debut - an instant impact from Siddharth Kaul pic.twitter.com/QBpXyZn1fy
— Vitality County Championship (@CountyChamp) May 11, 2024
మొహం చాటేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు
2013లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన కౌల్.. 2023 సీజన్‌లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. పొట్టి ఫార్మాట్‌లో అతని ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడంతో 2024 వేలంలో అమ్ముడుపోలేదు. రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతన్ని కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. 2017 సీజన్‍లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడిన సిద్ధార్థ్ కౌల్.. అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 10 మ్యాచ్ ల్లో 16 వికెట్లు పడగొట్టాడు.