![సిద్దార్థ్, అదితి వివాహం](https://static.v6velugu.com/uploads/2024/03/siddharth-marries-aditi-rao-hydari_4HMu7EGktD.jpg)
హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి వివాహం బుధవారం ఉదయం వనపర్తి జిల్లాలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. గర్భాలయం పక్కనే ఉన్న మంటపంలో తమిళ నాడు నుంచి వచ్చిన ముగ్గురు పురోహితులు సంప్రదాయ బద్ధంగా పెళ్లి జరిపించారు. బయటివారు ఎవరినీ ఆ సమయంలో లోపలికి అనుమతించలేదు.
ఆలయంలోని అర్చకులు, సిబ్బంది సెల్ఫోన్లను తీసుకుని, పెళ్లికి సంబం ధించి ఫొటోలు, వీడియోలు బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. అదితి రావు వనపర్తి సంస్థానాధీశుల వారసురాలు కావడంతో ఇక్కడ వివాహం జరిపించినట్టు తెలుస్తోంది. పెళ్లికి చివరి రాజు రాజారామేశ్వరరావు కుమారుడు కృష్ణదేవరావు తన కుటుంబంతో సహా హాజరయ్యారు.
2021లో వచ్చిన ‘మహాసముద్రం’ చిత్రంలో సిద్దార్థ్, అదితి కలిసి నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట.. వెకేషన్స్, ఈవెంట్స్‌లో తరచుగా కలిసి కనిపించారు. ఇక ఈ పెళ్లి విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు.