సిద్ధార్థ్ కొత్త చిత్రం షురూ

కమల్ హాసన్‌‌ ‘భారతీయుడు 2’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సిద్ధార్థ్.. హీరోగా తన 40వ చిత్రాన్ని ప్రారంభించాడు.  ‘8 తొట్టక్కల్’ ఫేం శ్రీగణేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ‘మావీరన్’ ఫేమ్  అరుణ్ విశ్వ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  మీథా రఘునాథ్, చైత్ర ఆచార్ హీరోయిన్స్‌‌.  శరత్ కుమార్, దేవయాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

ALSO READ : బ్రేకింగ్..లావణ్య ఫిర్యాదు..రాజ్ తరుణ్కు నోటీసులు పంపిన నార్సింగ్ పోలీసులు

టీమ్ అంతా పాల్గొన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు దర్శక నిర్మాతలు తెలియజేశారు.  ఈ చిత్రంలో శరత్ కుమార్, దేవయాని పాత్రలు  కథలో చాలా క్రూషియల్‌‌గా ఉండబోతున్నాయని అన్నారు. హై బడ్జెట్, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్‌‌తో రూపొందిస్తున్నామని, త్వరలోనే మరిన్ని అప్‌‌డేట్స్ ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.