ఎన్నో సినిమాలలో బాల నటుడిగా అలరించి ‘సిద్ధార్థ రాయ్’ చిత్రంతో హీరోగా మారి ప్రేక్షకులను అలరించాడు దీపక్ సరోజ్. తను హీరోగా సెకండ్ మూవీ ప్రారంభమైంది. హరీష్ గదగాని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని తన్నీరు హరిబాబు నిర్మిస్తున్నారు.
రొమాంటిక్ లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ సినిమాలో దీక్షిక, అనైరా హీరోయిన్లుగా నటిస్తున్నారు. గురువారం (Dec4న) పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా హాజరైన దర్శకులు వేణు ఊడుగుల క్లాప్ కొట్టగా, యదు వంశీ, ప్రదీప్ మద్దాలి స్ర్కిప్ట్‌ని అందించారు. సుజీత్ కెమెరా స్విచాన్ చేశాడు.
సందీప్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశాడు. జనవరిలో షూటింగ్ మొదలుపెట్టి ఏప్రిల్‌లో ముగించాలని ప్లాన్ చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలియజేశారు. రఘుబాబు, హైపర్ ఆది, సత్య, యాదమ్మ రాజు, రచ్చ రవి ఇతర కీలక పాత్రలలో నటించనున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.