Siddhu Jonnalagadda: ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ని లాక్ చేసుకున్న సిద్దు జొన్నలగడ్డ సినిమా

Siddhu Jonnalagadda: ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ని లాక్ చేసుకున్న సిద్దు జొన్నలగడ్డ సినిమా

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) SVCC37 గా రాబోతున్న జాక్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 10, 2025 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మేర‌కు ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయగా అభిమానులను ఆకట్టుకుంటోంది. . 

బొమ్మరిల్లు భాస్కర్‌ (Bhaskar) దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ (B.V.S.N.Prasad) నిర్మించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్(SVCC) బ్యానర్లో రాబోతున్న 37 వ సినిమా ఇది. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డకి జోడీగా బేబీ బ్యూటీ  వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) నటించనుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాలో తనదైన శైలిలో కొత్త స్థాయి వినోదాన్ని పంచుబోతున్నాడు.

అయితే, ఈ సినిమా సరిగ్గా ఏప్రిల్ 10 న వస్తుండటంతో ప్రభాస్ రాజాసాబ్ పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల నుండి రాజాసాబ్ రిలీజ్ వాయిదా విషయంపై నెట్టింట బాగా వినిపించింది. ఇక జాక్ రిలీజ్ డేట్ అనౌన్స్ తో క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ప్రభాస్ సినిమా రిలీజ్ రోజు వేరే హీరో సినిమా రావడం అంటే చాలా గట్స్ ఉండాలి. అలాంటి ధైర్యం ఎవ్వరికేలేదని చెప్పాలి. అయితే, రాజాసాబ్ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి కొన్ని రోజులే ఉన్నా.. గ్రాఫిక్స్ విషయంలో టైం తీసుకోనున్నట్లుటాక్ వినిపిస్తోంది.