JACK Trailer: సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్‌’ ట్రైలర్‌.. బొమ్మరిల్లు భాస్కర్ హై ఓల్టేజ్ యాక్షన్

JACK Trailer: సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్‌’ ట్రైలర్‌.. బొమ్మరిల్లు భాస్కర్ హై ఓల్టేజ్ యాక్షన్

‘టిల్లు స్క్వేర్’లాంటి సూపర్ సక్సెస్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నుంచి రాబోతున్న చిత్రం ‘జాక్‌‌’.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. బీవీఎస్‌‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సిద్ధుకి జంటగా వైష్ణవి చైతన్య నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నేడు (ఏప్రిల్ 3న) మేకర్స్ ‘జాక్‌‌’ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 3 నిమిషాల 7 సెకన్లు ఉన్న ఈ ట్రైల‌ర్ ఇంప్రెసివ్ గా ఉంది. యాక్ష‌న్ స‌న్నివేశాలు, సిద్ధు త‌న‌దైన కామెడీతో అల‌రించాడు. సిద్ధూ, వైష్ణవి మధ్య లవ్ ట్రాక్, డైలాగ్స్, ఆ రొమాంటిక్ నేచర్ అట్ట్రాక్టీవ్ గా ఉన్నాయి.

ఇందులో సిద్ధూ స్పై ఏజెంట్ గా కనిపిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో త‌న మిష‌న్ పేరు బ‌టర్‌ఫ్లై అంటూ సిద్ధూ చేసిన సంద‌డి మాములుగా లేదు. ట్రైలర్ చివర్లో రొమాన్స్ గురించి సిద్ధూ చెప్పే డైలాగులు, నాన్నగా నటించిన నరేశ్‌ తో పండించిన కామెడీ భలే అనిపిస్తోంది.

వీటితో పాటుగా సిద్ధుకి-ప్రకాష్ రాజ్ కి మధ్య వచ్చే డైలాగ్స్ సైతం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఓవరాల్ గా కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో పాటు.. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లపై బొమ్మరిల్లు భాస్కర్ దృష్టి పెట్టినట్టుగా అర్ధమవుతుంది. మరెలాంటి హిట్ అందుకోనున్నాడో చూడాలి. 

ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, కిస్ సాంగ్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తొంపాటుగా సీనియర్ నటుడు నరేష్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అచ్చు రాజ‌‌మ‌‌ణి సంగీతాన్ని అందిస్తున్నాడు.

►ALSO READ | OTT Horror Thriller: భయపెడుతున్న ట్రైలర్.. ప్రైమ్ వీడియోలోకి వస్తోన్న హారర్ థ్రిల్లర్ సీక్వెల్..