SiddhuJonnalagadda: పాత సినిమా..కొత్త పేరుతో.. ఐదేళ్ల తర్వాత థియేటర్లలోకి సిద్దు రొమాంటిక్ మూవీ

SiddhuJonnalagadda: పాత సినిమా..కొత్త పేరుతో.. ఐదేళ్ల తర్వాత థియేటర్లలోకి సిద్దు రొమాంటిక్ మూవీ

హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) నటించిన మూవీ 'కృష్ణ అండ్ హిజ్ లీలా' (Krishna and His Leela). రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించగా సురేశ్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇపుడీ ఈ మూవీ థియేటర్స్ కి రానుంది. అదేంటీ? సినిమా రిలీజై ఐదేళ్లు అవుతుంది.  ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ ఏంటీ? అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. వివరాల్లోకి వెళితే.. 

సిద్ధూకి యూత్‌లో పాపులారిటీ తెచ్చిపెట్టిన ఫస్ట్ మూవీ కృష్ణ అండ్ హిజ్ లీలా. ఈ మూవీ 2020లో కరోనా లాక్‌డౌన్‌లో డైరెక్ట్ ఓటీటీలో విడుదల అయ్యింది. రొమాంటిక్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు వీపరీతంగా నచ్చింది. ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో సిద్దు కెరీర్ లో డీజే టిల్లు వచ్చి చేరింది.

ఆ తర్వాత సిద్దు పాపులారిటీ అమాంతం టాలీవుడ్ క్రేజియెస్ట్ హీరోగా నిలిపింది. అయితే, సిద్ధుకి ఉన్న క్రేజీతోనే 'కృష్ణ అండ్ హిజ్ లీలా' సినిమా టైటిల్ చేంజ్ చేసి థియేటర్ కి తీసుకురానున్నారు. ఓటీటీలో రిలీజైన సినిమాకు ఇలా టైటిల్ చేంజ్ చేసి థియేటర్స్ లో విడుదల చేయడం ఇదే మొదటిసారి. అయితే, టైటిల్ చేంజ్ కి బలమైన కారణం ఉంది సుమా! 

ALSO READ | GrammyAwards: గ్రామీ విజేతల జాబితాలో ఏకైక భారత సంతతి సింగర్.. ఎవరామె..?

ఈ సినిమాలో కృష్ణ అనే యువకుడి జీవితంలో సత్య, రుక్సర్, రాధా మధ్య జరిగే ప్రేమ కథే ‘కృష్ణా అండ్ హీస్ లీల’ సినిమా రొమాంటిక్ మూవీ కావడంతో 'కృష్ణా అండ్ హిజ్ లీల’ అని దేవుడి పేరు పెట్టడంతో అప్పట్లో వివాదాస్పదం అయ్యింది. ఇక అప్పుడొచ్చిన వివాదం మళ్ళీ రిపీట్ కాకుండా మేకర్స్ జాగ్రత్త పడుతూ టైటిల్ చేంజ్ చేశారు.

ఇక కృష్ణ అండ్ హిజ్ లీలా కాస్తా, ‘its complicated’ అనే పేరుతో థియేటర్లలో రిలీజ్ కానుంది. లవర్స్ డే స్పెషల్గా ఫిబ్రవరి 14న థియేట్రికల్‌గా రీ రిలీజ్ కి ప్లాన్ చేశారు. దగ్గుబాటి రానా సమర్పిస్తున్న ఈ మూవీ కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లు షురూ చేశారు. ఈ మేరకు రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. మరి థియేటర్స్లో సిద్దు తన రొమాంటిక్ నేచర్తో ఎలాంటి రిజల్ట్ పొందుతాడో చూడాలి.