టిల్లు స్క్వేర్’తో మరో బ్లాక్ బస్టర్‌ను అందుకున్న సిద్దు జొన్నలగడ్డ..‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటించబోతున్నాడు. ప్రముఖ స్టైలిష్ట్ నీరజ కోన ఈ మూవీతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. గత ఏడాది పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభించగా.. రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ఆగస్ట్ 6న గ్రాండ్ గా షురూ అయింది. ఈ సందర్బంగా మేకర్స్ షూట్ బిగిన్స్ అంటూ ఓ వీడియో షేర్ చేయగా..సిద్దు ఫ్యాన్స్ అల్ ది బెస్ట్ భయ్యా అంటూ విషెష్ చేస్తున్నారు.
Also Read :- హిందూ మహిళ ఆవేదన
హైదరాబాద్‌లో ముప్ఫై రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది.ఈ షెడ్యూల్లో కీలకమైన టాకీ సన్నివేశాలు మరియు సాంగ్స్ షూట్ చేయనున్నారు.లీడ్ యాక్టర్స్ అంతా షూటింగ్‌లో పాల్గొననున్నారు.రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్స్.వైవా హర్ష కీలకపాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమలో సిద్ధూ సరికొత్తలుక్ లో కనిపిస్తూ స్టైలిష్ మేకోవర్ సెట్ చేసుకున్నాడు. ఒక అబ్బాయి, అమ్మాయి కథతో పాటు స్నేహం, కుటుంబం, త్యాగం, సెల్ఫ్ లవ్‌కి సంబంధించిన కథ ఇదని తెలుస్తోంది.
The cameras roll for #TelusuKada 🎥
— People Media Factory (@peoplemediafcy) August 6, 2024
A romantic journey begins ❤️🔥
You will surely fall in love all over again with this breezy love tale. 😍@NeerajaKona #SiddhuJonnalagadda #RaashiiKhanna @SrinidhiShetty7 @MusicThaman @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla… pic.twitter.com/5aOCo7s33s
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్.లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే తెలుసు కదా చిత్రానికి. జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.నేషనల్ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు.