Jack Box Office: టిల్లూ స్క్వేర్‌ మాస్ రాంపేజ్.. జాక్ సీన్ రివర్స్.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?

Jack Box Office: టిల్లూ స్క్వేర్‌ మాస్ రాంపేజ్.. జాక్ సీన్ రివర్స్.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?

టిల్లూ స్క్వేర్ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన సిద్ధూ లేటెస్ట్ మూవీ ‘జాక్’. ఈ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశపరిచింది. ఇండియా వైడ్గా రూ.2.50కోట్ల షేర్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో కోటిన్న‌ర వ‌ర‌కు వ‌సూళ్ల‌ను సాధించగా, ఓవ‌ర్‌సీస్‌లో మ‌రో కోటి వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. 

టిల్లూ స్వ్కేర్ ఫస్ట్ డే ఏకంగా రూ.23 కోట్ల గ్రాస్ రాబట్టి, బాక్సాఫీస్‌ దగ్గర సిద్దు జొన్నలగడ్డ సత్తాను చాటింది. కేవలం ఏపీ, తెలంగాణలలో రూ.13.45 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.9.28 కోట్ల గ్రాస్ , రెస్టాఫ్ ఇండియాలో రూ.96 లక్షలు చొప్పున వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో భారీ అంచనాల మధ్య వచ్చిన జాక్ మూవీ సిద్ధూని బాగా డిస్సప్పాయింట్ చేసింది.

ఈ సినిమా ఇండియా వైడ్ ఓవరాల్‌గా 24.14 శాతం థియేటర్ ఆక్యూపెన్సీ నమోదు చేసుకుంది. హైదరాబాద్ లో మొత్తం 443 షోలకి గాను 28.00%గా ఆక్యూపెన్సీ ఉంది. మ్యాట్నీ, సెకండ్ షోలకు మంచి బుకింగ్స్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. జాక్‌పై ఉన్న అంచనాలు, క్రేజ్‌కు.. వచ్చిన ఈ ఓపెనింగ్స్ నిరాశపరిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. మరి ఈ వీకెండ్ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి.