Jack X Review: జాక్ X రివ్యూ.. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌ మూవీకి టాక్ ఎలా ఉందంటే?

Jack X Review: జాక్ X రివ్యూ.. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌ మూవీకి టాక్ ఎలా ఉందంటే?

సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా ‘బొమ్మరిల్లు భాస్కర్’రూపొందించిన  చిత్రం ‘జాక్’(Jack). బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు (2025 ఏప్రిల్ 10న) విడుదలైంది. అచ్చు రాజ‌‌మ‌‌ణి సంగీతాన్ని అందించాడు.

స్పై యాక్ష‌న్ కామెడీ క‌థాంశంతో తెరకెక్కిన జాక్ ఏప్రిల్ 9న ఓవ‌ర్‌సీస్ ఆడియన్స్ ముందుకొచ్చింది. అక్కడ  ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉంది? డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తన మార్క్ చూపించాడా? లేదా అనేది X (గతంలో ట్విట్టర్) రివ్యూలో తెలుసుకుందాం.

నోట్: రివ్యూ అనేది ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అదే కన్ఫామ్ కాదు. అందువల్ల సినిమా ఎవ్వరికీ వాళ్ళు చూసి ఆస్వాదించడమే అసలైన కోణం.

ఇప్పటివరకు ఫ్యామిలీ, ల‌వ్‌స్టోరీ సినిమాల ద‌ర్శ‌కుడిగా తనదైన ముద్ర‌ చూపించారు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్. ఈ సినిమాతో స్పై యాక్షన్ కామెడీ అంటూ తన పంథాను మార్చుకుని జాక్ తెరకెక్కించాడు.  స్పై యాక్ష‌న్ అంశాలు ప్రేక్షకులను థ్రిల్‌ పంచేలా ఉందని, సిద్ధూ, వైష్ణవి చైతన్య మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగా కుదిరాయని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు సిద్దూ, కామెడీ సీన్లు, బీజీఎం పాజిటివ్ అంశాలని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే, కొంతమంది నెటిజన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ సైతం వినిపిస్తోంది. థ్రిల్లింగ్ సీన్స్ అంతగా ఆకట్టుకోలేదని రివ్యూలు ఇస్తున్నారు. 

‘జాక్‌ మూవీ ఓన్లీ ఫర్ సిద్దూ! కొన్ని కామెడీ సీన్లు, సిద్ధు పాత్ర మాత్రమే బాగా ఆకట్టుకునే అంశం. మిగతావేవి అంతగా పనిచేయలేదు. . సిద్ధు డైలాగ్స్‌, కామెడీ టైమింగ్‌ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. కథ, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్‌, పాటలు, బీజీఎం, సినిమాటోగ్రఫీ..ఏది కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి’అంటూ ఓ నెటిజన్‌ రివ్యూ ఇచ్చాడు. 

జాక్ స్పై కామెడీ పేరుతో నిరాశపరిచాడు.సిద్ధుజోన్నలగడ్డ తన ఉత్తమ నటనను కనబరిచాడు. జాక్ పాత్ర వెనుక మంచి ఆలోచన ఉంది. కొన్ని సన్నివేశాలలో నేపథ్య సంగీతం చాలా బాగుంది. అయితే, చాలా వరకు స్పై సన్నివేశాలు అర్థం కావు. కామెడీ అంతగా క్లిక్ అవ్వదు.  కథ చాలా సులభమైన రచనతో నిండి ఉంది. ఇందులో చాలా ట్రాక్‌లు ఉన్నాయి, కానీ ఏవీ సరిగ్గా అభివృద్ధి చేయకపోవడం మైనస్. VFX అంతగా కుదరలేదు. నేపాల్ సీక్వెన్స్ తెరపై విరిగిపోయినట్లు కనిపిస్తుంది. పాటలు అస్సలు పని చేయవు.  భావోద్వేగ సన్నివేశాలు చప్పగా అనిపిస్తాయి. ఇందులో సిద్ధు తప్ప, ఆస్వాదించడానికి పెద్దగా ఏమీ లేదు అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

జాక్ అనేది ఒక స్పై యాక్షన్ కామెడీ. స్పై సీన్స్, కామెడీ రెండూ చాలా వరకు అందించడంలో విఫలమయ్యారు మేకర్స్. 
దర్శకుడు భాస్కర్ ఈ చిత్రంలో అన్ని రకాల అంశాలను అందించడానికి ప్రయత్నించాడు. కానీ వాటిలో ఏవీ కూడా గట్టి ప్రభావాన్ని చూపలేకపోయాయి.  ఎందుకంటే అతకని స్క్రీన్‌ప్లే మరియు బలహీనమైన రచన.

సిద్ధు వాటిని ఓవర్ కమ్ చేయడానికి చాలా ప్రయత్నించాడు. కానీ సంభాషణలు/సన్నివేశ రచన మద్దతు ఇవ్వనప్పుడు అతను పెద్దగా ఏమీ చేయలేకపోయాడు.  మొత్తం స్పై భాగం మరియు టెర్రరిజం విలన్ కోణం పేలవంగా ఉంది. కామెడీ మరియు వన్ లైనర్లు అస్సలు పని చేయలేదు. సంగీతం బాగోలేదు. నిర్మాణ విలువలు చాలా తక్కువగా ఉన్నాయి. గ్రీన్ స్క్రీన్ వాడకం స్పష్టంగా కనిపించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. కూర్చోవడం కష్టం! అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.