గతేడాది ఫిబ్రవరిలో ‘డీజే టిల్లు’గా ఆడియన్స్ ముందుకొచ్చి సూపర్ సక్సెస్‌ను అందుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ‘డీజే టిల్లు’కు సీక్వెల్‍గా ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) సినిమా తెరకెక్కుతోంది. మల్లిక్ రామ్ (MallikRam) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఎలక్ట్రిఫైయింగ్ టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూస్తుంటే..టిల్లు గాడు..డబుల్ టైం పిచ్చెకించే విధంగా..డబుల్ టైం నవ్వుకునే విధంగా ఆకట్టుకుంటోంది. సిద్ధు జొన్నలగడ్డ స్టైల్, డైలాగ్ డెలివరీ స్వాగ్, హీరోయిన్స్తో రొమాంటిక్ యాంగిల్స్ ట్రైలర్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి.
టిల్లు అనేటోడు..నార్మల్ టిల్లు అయితే కాదు..నేనొక కారణజన్ముడిని. నా ఈ జన్మకు కారణం ఏంటంటే..ఈ ఊర్లో ఎన్ని పంచాయితీలున్నాయి..? ఎన్ని లేడీస్ పంచాయితీలున్నాయి. అలాంటి లంగ, లత్కోర్,చీప్, చిల్లర్,డ్రైనేజ్ లొల్లిలు తెచ్చి నా నెత్తి మీద కూచున్నవి అంటూ సిద్దు చెప్పే డైలాగ్ అదిరిపోయింది. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లుక్స్తో, రొమాంటిక్ సీన్స్ తో ఆడియన్స్కి డీజే టిల్లు రాధికాను మరిచిపోయేలా చేసిందనే విషయం ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్, టీజర్ ఆడియన్స్ను వీపరీతంగా ఆకట్టుకున్నాయి. రాధికా..రాధికా..ముందుకా..వెనుకాక..'రింగుల జుట్టు చూసి పడిపోయానే..నీ మాటలు విని పడిపోయానే..నీ గాలి సోకితేనే సచ్చిపోయానే' అనే సాంగ్తో యూత్లో మంచి జోష్ తీసుకొచ్చారు మేకర్స్.
ఈ సినిమాకు రామ్ మిర్యాలతో పాటు అచ్చు రాజమణి మ్యూజిక్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై టిల్లు స్క్వేర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ మూవీ మార్చి 29 న థియేటర్స్ లోకి రానుంది.
డీజే టిల్లు మూవీతో ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దు జొన్నలగడ్డ..ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘టిల్లు స్క్వేర్’ కాగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో జాక్ అనే మూవీ చేస్తున్నాడు. మరోవైపు నీరజ కోన దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘తెలుసు కదా’ మూవీలోను నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాశి ఖన్నా, నిధి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.