ఇంటర్​ పరీక్షలు సజావుగా నిర్వహించాలి :  కలెక్టర్ మనుచౌదరి

ఇంటర్​ పరీక్షలు సజావుగా నిర్వహించాలి :  కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో ఇంటర్​పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్ లో సీపీ అనురాధతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  మార్చి 5 నుంచి 25 వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు 43 పరీక్షా కేంద్రాలు  ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం బీసీ వెల్ఫేర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. బీసీ హాస్టల్​లో  కామన్ డైట్ మెనూ ఇంప్లిమెంటేషన్ లోఎదురయ్యే సమస్యలపై సమీక్షించారు. బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు సరిపడా వంట పాత్రలు లేవని, కూరగాయలు, నాన్ వెజ్, ఫ్రూట్స్, పాలు, పెరుగు టెండర్ ద్వారా హాస్టళ్లకు సప్లై చేయాలని హెచ్ డబ్ల్యూవోలు కలెక్టర్ ను కోరగా ఆయన సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

జిల్లాలోని అన్ని బీసీ వెల్ఫేర్ హాస్టళ్లను సందర్శించి వాటిలో నెలకొన్న సమస్యలను తెలుసుకొని నివేదిక అందించాలని జిల్లా ఇన్​చార్జి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డీఆర్డీవో నాగరాజమ్మను కలెక్టర్ ఆదేశించారు. ఆయా సమావేశాల్లో అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్​, అబ్దుల్ హమీద్, ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, డీఐఈవో రవీందర్ రెడ్డి, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, డీఎంహెచ్​వో పల్వాన్ కుమార్ పాల్గొన్నారు.