
హుస్నాబాద్, వెలుగు : గౌరవెల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను నిర్మించాలని, ఇందుకు అవసరమైన భూ సేకరణ పనులను మొదలుపెట్టాలని సిద్దిపేట కలెక్టర్మనుదీప్చౌదరి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం గౌరవెల్లి ప్రాజెక్టును ఆయన పరిశీలించారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులతోపాటు ప్రోగ్రెస్ చేయాల్సిన పనుల వివరాలను ప్రాజెక్టు డీఈలు ప్రశాంత్, కరుణశ్రీని అడిగి తెలుసుకున్నారు. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం, వాటికి కావాల్సిన భూమిపై అధికారులు కలెక్టర్కు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో తక్షణమే కాల్వల నిర్మాణం కోసం భూమి సేకరించాలని కలెక్టర్ఆదేశించారు.