
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామిని సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ కు లడ్డూ ప్రసాదం
స్వామి వారి చిత్ర పటాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆలయ ఈవో బాలాజీని అడిగి తెలుసు కున్నారు. ఆయనవెంట ఏఈవో శ్రీనివాస్, ప్రధాన అర్చకుడు మల్లికార్జున్, ఎస్ఐ నాగరాజు, ఓగ్గు పూజారులు ఉన్నారు.