
- సిద్దిపేట సీపీ అనురాధ
సిద్దిపేట రూరల్, వెలుగు : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని సిద్దిపేట సీపీ అనురాధ సూచించారు. గురువారం ఆమె సీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి 31వరకు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్-లో భాగంగా 71 మంది బాలురు, 14 మంది బాలికలను గుర్తించి వారి తల్లిదండ్రులకు, బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. బాల కార్మికులతో పనిచేయించుకుంటున్న యజమానులపై 9 కేసులు నమోదు చేశామన్నారు.
ఆపరేషన్ స్మైల్ ను విజయవంతం చేసిన నోడల్ అధికారి, అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, వివిధ డిపార్ట్మెంట్ అధికారులను, సిబ్బందిని ఆమె అభినందించారు. ఎప్పుడైనా ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 సమాచారం అందించాలని సూచించారు.
మెదక్లో..
మెదక్ టౌన్ : జిల్లాలో ఆపరేషన్స్మైల్ కింద చేపట్టిన దాడుల్లో 79 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ బాలస్వామి తెలిపారు. ఇందులో భాగంగా బాలకార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్న వివిధ కంపెనీలు, షాపుల యజమానులపై కేసులు నమోదుచేశామన్నారు.
జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే డయల్100 కి కానీ 1098 కి కానీ కాల్ సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐలు మల్లయ్య, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు మోహన్, షరీఫ్, నర్సింహ, రాజు, జ్యోత్స్న, జ్యోతి, రవి, శంకరయ్యను అభినందించారు.