సోషల్​ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు :సీపీ అనురాధ

సోషల్​ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు :సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: సోషల్​ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని సీపీ అనురాధ హెచ్చరించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేశామని, అన్ని గ్రూపులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు ఎవరూ నమ్మొద్దని సూచించారు. విద్వేషకర పోస్టులు షేర్ చేసినా వారి సమాచారాన్ని కంట్రోల్ రూమ్ వాట్సప్ నెంబర్  8712667100 కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.